సెక్రటేరియట్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్ డైరెక్టర్ అగ్రికల్చర్ తో సమీక్ష నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో నమోదైన యూరియా కొరతకు సంబంధించిన సమస్యలను సమీక్షించారు. దీనిపై వ్యవసాయ సంచాలకులు వివరిస్తూ ఇట్టివాళ్ళ జరిగిన లారీల సమ్మె కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని, వారి సమ్మె నిష్కరించడంతో. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు.
మిర్చి ధర, తెగుళ్ల నియంత్రణ చర్యలలో ఇటీవల మార్కెట్ సంబంధిత సమస్యల గురించి సమీక్షించారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంటల వైవిధ్యాన్ని పెంచడంపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ పంటలకు కావాల్సిన విత్తన లభ్యత అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధిక వరి పంటను ఎగుమతి దిశగా భారత ప్రభుత్వానికి నివేధికా సమర్పించే విధముగా ప్రణాళికను సిద్దం చేయమని సూచించారు. రైతుకు నష్టం లేదా తక్కువ ధరకు కారణంగా ఉన్న మద్యావర్తులను నిర్మూలించే విధముగా పరశీలించమని సూచించారు. వ్యవసాయ ఉద్యోగుల అన్నీ సంఘాల ప్రతినిధులతో వారి వివిధ సమస్యల పై సమీక్ష నిర్వహించమని వ్యవసాయ సంచాకులను సూచించారు.
