Site icon NTV Telugu

Tummala Nageswara Rao : టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్ కిన్ తయారీ యూనిట్లు

Tummala Nagewshwer Rao

Tummala Nagewshwer Rao

టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్ కిన్ తయారీ యూనిట్ల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఇవాళ సెక్రటేరియట్‌లో తుమ్మల నాగేశ్వరరావు తన శాఖలపై పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీ.ఎస్.ఐ.ఐ.సి ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, జౌళిశాఖ సంచాలకులు అలుగు వర్షిణి, హార్టికల్చర్ సంచాలకులు అశోక్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి. లక్ష్మీబాయితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. అకాల వర్షాల వలన రైతులు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

PM Modi: దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న డబ్బుపై మోడీ ఆసక్తికర వివరణ

మార్కెటింగ్ , గిడ్డంగుల సంస్థ గోదాములపైన సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. ఖమ్మం మార్కెట్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికరించేలా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. కొహెడ పండ్ల మార్కెట్ నుండి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా అన్ని మౌళికసదుపాయాలతో అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. బుగ్గపాడు మెగా టెక్స్ టైల్ పార్కులో వచ్చేనెలలో పరిశ్రమల ప్రారంభోత్సవం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

Sajjala Ramakrishna Reddy: కుప్పంలో కూడా మేం గెలవబోతున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి చక్కటి ఫలితాలు..!

Exit mobile version