గత కొద్ది నెలలుగా పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ మాంద్యం కారణంగా తీవ్ర నష్టాల పాలయ్యింది. దీని కారణంగా ఫ్యాక్టరీలలో ఉత్పత్తులు పెరిగి
గోదాముల్లో నిలువలు పెరుకుకుపోయాయి. దీంతో పాటు హైదరబాద్ తదితర మార్కెట్లలో ఫాలిస్టర్ వస్త్రాల అమ్మకాలు తగ్గిపోవడంతో
కార్మికులకు, వస్త్ర పరిశ్రమ అనుబంధ సభ్యులకు పని కల్పించలేక, సకాలంలో జీతాలు అందించలేక 15వ తేదీ నుండి ఫ్యాక్టరీలను మూసి
వేయాలని తలంచారు..
ఈ విషయాన్ని అధికారులు రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, మార్కెటింగ్ శాఖా మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకరాగ
కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో వెంటనే స్పందించి, ప్రభుత్వం ద్వారా అర్వియం ఆర్డర్లు మాక్స్ &SSI యూనిట్స్ ద్వారా నేత
కార్మికులకు త్వరోలోనే ఇచ్చేవిధంగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
అంతే కాకుండా.. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ ఎదుర్కుంటున్న సమస్యలతో పాటు ఇతర పరిశ్రమలు ఎదుర్కుంటున్న సమస్యలపై అధ్యయనం చేసి
సమగ్ర నివేదిక అందజేయాలని రాష్ట్ర చేనేత విభాగం డైరెక్టర్ అలుగు వర్షిణి, రీజినల్ డైరక్టర్ అశోక్ రావును ఆదేశించారు.
