NTV Telugu Site icon

Tummala Nageswara Rao : ఎవ్వరూ ఎటువంటి సూచనలు ఇచ్చిన తీసుకుంటాం

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంప్ హౌస్ వద్ద ట్రయల్ రన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గోదావరి జలాలు పరవళ్ళు తొక్కుతుండటంతో ఆయన ఒక్కసారిగా పరవశించిపోయారు. ఆనందంతో భూమాతకు సమస్కరించారు మంత్రి తుమ్మల.. త్వరగా పనులు పూర్తి చేసి నీటిని అందించాలంటూ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వడమే తన చివరి కోరిక అన్నారు మంత్రి మంత్రి తుమ్మల. గోదావరి జిల్లాల మాదిరిగా ఖమ్మం జిల్లాలో సాగు ఇవ్వాలన్నది తన కోరికగా చెప్పారు. కూల్చిన ఇంటిలోకి వచ్చాం.. కొంతసమయం పట్టింది.. నిన్నటి వరకు ఎన్నికల మీదనే దృష్టి పెట్టామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఇక పరిపాలన మీద దృష్టి పెట్టామన్నారు. డబ్బులన్నీ రైతుల కష్టాలను తీర్చేందుకు ఇస్తున్నామన్నారు మంత్రి నాగేశ్వర రావు. సీఎం మాట ప్రకారం భట్టి ఆ కోరిక తీర్చుతున్నారని, ఎవ్వరూ ఎటువంటి సూచనలు ఇచ్చిన తీసుకుంటానని ఆయన అన్నారు. పంట వేసిన నిజమైన రైతులకు సహాయం చేయాలని, అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రతి నిర్ణయం తీసుకున్నామని, గతం లో మీ మాట వినలేదు… నేడు అలా కాదు మీ మాట వినే ప్రభుత్వం మీ ముందు వుందన్నారు. విభిన్న సంస్కృతులు కలసిన జిల్లా భద్రాచలమని, పామాయిల్ జిల్లాగా మార్చుతున్నామన్నారు.