Tummala Nageswara Rao : సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక సర్వే చాలా పకడ్బందీగా చేయాలి

  • లబ్ధిదారుల ఎంపిక సర్వే చాలా పకడ్బందీగా చేయాలి
  • వ్యవసాయ యోగ్యం కానీ భూములకు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదు
  • అనర్హులకు ఏ ఒక్క సంక్షేమ పథకం చేరకూడాదు : మంత్రి తుమ్మల
Tummala

Tummala

Tummala Nageswara Rao : కీలక సంక్షేమ పథకాలు జనవరి 26 నుండి అమలు కాబోతున్నాయని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జ్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక సర్వే చాలా పకడ్బందీగా చేయాలన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములకు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదని, అనర్హులకు ఏ ఒక్క సంక్షేమ పథకం చేరకూడాదన్నారు. వచ్చే వారం రోజులు ఉద్యోగులు చేసే సర్వే అధికారులకు, ప్రభుత్వానికి కీలకమని, గత ప్రభుత్వం అధికారుల ప్రమేయం లేకుండానే లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. గత ప్రభుత్వం తప్పుడు విధానంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసిందని, పేదలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళిక బద్దంగా ముందుకు తీసుకుపోతున్నామని, కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీగా ప్రభుత్వం జీవో లను విడుదల చేసిందన్నారు.

Bhatti Vikramarka : పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం