Site icon NTV Telugu

Tummala Nageswara Rao : ప్రభుత్వం తక్షణ సహాయం 10 వేల నగదు వారి అకౌంట్‌లో జమ చేస్తోంది

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

ఖమ్మం కార్పొరేషన్ కార్యాలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. వరద ఉధృతి తగ్గుముఖం పట్టినా వెంటనే పూర్తి స్థాయి సహాయ పనులు మొదలు పెట్టామని, శానిటేషన్ వరంగల్ హైదారాబాద్ నుండి కార్మికులు వచ్చారన్నారు మంత్రి తుమ్మల. విద్యుత్ సరఫరా ఇచ్చాము, భోజనాలు అందిస్తున్నామని, నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ జరుగుతుందని ఆయన అన్నారు. ఫైర్ ఇంజన్ అందుబాటులో తెపించామని, రోడ్ల పై ఇండ్ల పై బురద తొలగించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు మంత్రి తుమ్మల. 2 రోజులలో సాధారణ స్థాయి తీసుకొచ్చిన జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులను ప్రత్యేకంగా అభినందించారని, తక్షణ సహాయం 10 వేలు నగదు వారి అకౌంట్ లో జమ చేస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. పోలీసులు సిపి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తూ అద్భుత కృషి చేశారని, జిల్లా వ్యాప్తంగా 7400 పైగా కుటుంబాలకు నష్ట పోయినట్లు తాత్కాలిక నిర్ద్రారణ అయినట్లు ఆయన తెలిపారు. 10 టీమ్ లతో హెల్త్ టీమ్ వర్క్ చేస్తోంది..ఇంటి ఇంటికి వైద్య చెకప్ జరుగుతుందన్నారు.

 Ganesh Chaturthi : ఎలాంటి గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే మంచిది?.. ప్రతిష్ఠాపన విధానం.. శుభ ముహూర్తం?

Exit mobile version