ఈనెల 18న రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు తుమ్మల నాగేశ్వరరావు. అన్ని మండల కేంద్రాల్లో ఉన్న రైతు వేదిక వద్ద సంబరాలు జరుపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హోదాలో రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయబోతున్నారని, లక్ష రూపాయలు ఒకసారి… ఆగస్టులో మిగతా రుణమాఫీ చేయాలని ప్రభుత్వ నిర్ణయమన్నారు తుమ్మల నాగేశ్వరరావు. కుటుంబ నిర్దారణ కోసమే రేషన్ కార్డు అడిగామని, గత రెండు సార్లు చేసినట్లుగానే రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి తుమ్మల. అంతేకాకుండా.. పాత పద్దతిలోనే వైఎస్స్సార్, కేసీఆర్ ఇలానే రుణమాఫీ చేశారని, ఎన్నికల ముందు 20 వేల కోట్లు ఉంటే 13 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు.. 1400 కోట్లు రిటర్న్ వచ్చాయని ఆయన తెలిపారు. పాత పద్దతి డేటా ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని, 60లక్షల ఖాతాల్లో 6 లక్షల మందికి రేషన్ కార్డులు లేవన్నారు. గతంలో రుణమాఫీ 1లక్షా 40వేలు ఉంటే లక్ష వరకు మాత్రమే చేశారని, ఒకేసారి రుణమాఫీ చేస్తామంటే మా ప్రభుత్వం మీద బురద జల్లడం భావ్యమా? అని ఆయన ప్రశ్నించారు. అనవసరమైన మాటలు మాట్లాడి పలుచన కావొద్దని నా మిత్రులకు మనవని, పంట రుణాలు తీసుకున్న 39 లక్షల కుటుంబాలు తీసుకున్నాయన్నారు. రుణాలు తీసుకున్న రైతులు అందరికీ మాఫీ చేస్తామని, 11లక్షల 50 వేల మందికి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. రైతుల పాత బకాయిలు బ్యాంకులు తీసుకోవద్దని చెప్పామన్నారు. బీఆర్ఎస్ కు రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత లేదని, రైతుని రుణ విముక్తిని చేయలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు మంత్రి తుమ్మల. ఐఎఎస్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు రుణమాఫీ ఇవ్వమని, కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ చేస్తామన్నారు.