ఖమ్మం జిల్లా ఎన్కూర్ మండలం ఇమామ్ నగర్ వద్ద సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పరిశీలించారు. కెనాల్ పనులను పరిశీలించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు బైక్ పై ప్రయాణించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. కెనాల్ పనులను రైతులు అడ్డుకోవద్దు మీ కాళ్లు పట్టుకుంటా అని ఆయన అన్నారు. సీతారామ కాలవ త్రవ్వటానికి 100 ఎకరాలు రైతులు ఇవ్వండని ఆయన కోరారు. లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని, రైతులకు మెరుగైన ప్యాకేజీని అందిస్తామన్నారు మంత్రి తుమ్మల. మీరు చేసిన సహాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవిస్తామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. అంతేకాకుండా.. కెనాల్ పనులు నెల రోజుల్లో పూర్తి కావాలని, కెనాల్ పనులు పూర్తయ్యే వరకు అధికారులు రాత్రింబవళ్లు కష్టపడాలన్నారు. నేను ఏ రాత్రి అయినా పనులు పరిశీలనకి వస్తా అని ఆయన అన్నారు. ఆగస్టు 15 కల్లా పనులు పూర్తి కావాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే ప్రారంభిస్తామన్నారు.
Tummala Nageshwara Rao : కెనాల్ పనులను రైతులు అడ్డుకోవద్దు మీ కాళ్లు పట్టుకుంటా

Tummala Nageswara Rao