Site icon NTV Telugu

Maharastra : మ్యాంగో జ్యూస్‎లో నిద్రమాత్రలు కలిపిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

Aamras

Aamras

Maharastra : మహారాష్ట్రలోని తుల్జాపూర్‌లో భర్తకు మ్యాంగో జ్యూసులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది భార్య. బాధిత భర్త తెలిపిన వివరాల ప్రకారం.. భర్త కుటుంబం మొత్తానికి అతని భార్య ఇలా చేసింది. దీంతో ఒక రోజంతా వారు నిద్రలోనే ఉండిపోయారు. మరుసటి రోజు అతను నిద్ర లేచినప్పుడు తన శరీరం నుండి చాలా నొప్పిని అనుభవించాడు. ఆ తర్వాత అతడు భార్యను నిలదీయగా నిజాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతం భార్యపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తుల్జాపూర్ తాలూకా నంద్‌గావ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మహేష్ కుమార్ తన భార్య, మొత్తం కుటుంబంతో ఈ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. మహేష్ భార్య పేరు భాగ్యవతి చింగుండే. మహేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మే 24న అతని భార్య భాగ్యవతి తన భర్త మహేష్‌ని భోజనానికి పిలిచింది. ఈ విందు కోసం మహిళ ప్రత్యేకంగా మ్యాంగో జ్యూస్ సిద్ధం చేసింది. ఆమె దాంట్లో అనే నిద్ర మాత్రలను కలిపింది.

Read Also:Prajwal Revanna: జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్

ఈ మాత్రలు తీసుకోవడం వల్ల మహేష్ కుమార్, అతని కుటుంబం జీవితం ప్రమాదంలో పడుతుందని తెలిసినప్పటికీ భాగ్యవతి మ్యాంగో జ్యూసులో నిద్రమాత్రలు కలిపింది. దానిని మహేష్, అతని కుటుంబ సభ్యులు తీసుకున్నారు. ఇది తిన్న మహేష్ తో పాటు కుటుంబ సభ్యులు మరుసటి రోజు ఉదయం చాలాసేపు నిద్రపోయారు. నిద్ర నుంచి లేచి చూసే సరికి శరీరం నొప్పిగా ఉందని మహేష్ తెలిపాడు. ఈ విషయాన్ని మహేష్ తన భార్యకు చెప్పగా, ఆమె మొత్తం నిజాన్ని అంగీకరించింది. ఆమ్రాలలో నిద్రమాత్రలు కలిపినట్లు భాగ్యవతి చెప్పింది. ఇది విన్న మహేష్ కోపానికి అవధులు లేవు. భార్యపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అతడు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసు బృందం కేసు దర్యాప్తు ప్రారంభించింది. పోలీసులు భాగ్యవతి చింగుండేపై సెక్షన్ 328 కింద కేసు నమోదు చేశారు. భాగ్యవతి మ్యాంగో జ్యూసులో నిద్రమాత్రలు ఎందుకు తన భర్త కుటుంబానికి ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:Supreme court: తాగునీటి కోసం ఆప్ ప్రభుత్వం పిటిషన్.. ఏం కోరిందంటే..!

Exit mobile version