Perform These Remedies on Tuesday To Seek Lord Hanuman’s Blessings: సనాతన ధర్మంలో వారంలోని అన్ని రోజులు ఏదో ఒక దేవత లేదా దేవుడికి అంకితం చేయబడ్డాయి. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున భక్తిశ్రద్దలతో హనుమంతుడిని ఆరాధించి, కొన్ని ప్రత్యేక చర్యలు చేస్తే.. కుటుంబంపై ఆయన ఆశీర్వాదం ఉంటుందని సనాతన ధర్మంలో చెబుతారు. అంతేకాదు నిలిచిపోయిన పని కూడా త్వరగా పూర్తవుతుంది. ఇంట్లో డబ్బు రాక మొదలవుతుంది. మంగళవారం చేయాల్సిన ఆ 3 ప్రత్యేక పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి ఆకులు:
శాస్త్రాల ప్రకారం హనుమంతుడికి తులసి మొక్క అంటే చాలా ఇష్టం. ప్రతి మంగళవారం హనుమంతుడి పాదాల వద్ద తులసి ఆకులను పెట్టి పూజిస్తే.. భక్తులపై ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. దాంతో సమస్యలన్నీ సమసిపోతాయి. ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి.
Also Read: Chess World Cup 2023: చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నేడు ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్‌తో తుది పోరు!
బూందీ లడ్డూ:
మత పండితుల ప్రకారం మంగళవారం హనుమంతుడికి బూందీ లడ్డూలను సమర్పించండి. హనుమంతుడికి ఈ లడ్డూలు అంటే చాలా ఇష్టమని, తన ముందున్న వాటిని చూసి చాలా సంతోషిస్తాడని చెబుతారు. ఈ లడ్డూను సమర్పించే భక్తులపై హనుమంతుడి ఆశీర్వాదాలు ఉంటాయి. దాంతో ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది.
కుంకుమ:
హనుమంతుడు తన శరీరంపై కుంకుడు పూయడానికి ఇష్టపడతాడు. అందుకే మంగళవారం మీ సమీపంలోని ఆలయానికి వెళ్లి హనుమంతుడికి మల్లె నూనె మరియు కుంకుమ సమర్పించండి. ఈ పరిహారం చేస్తే డబ్బు సంబంధిత సమస్యలు ఉండవు. దీంతో పాటు అప్పు కూడా తీరిపోతుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)