ఆంజనేయ స్వామికి హిందువులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. అందుకే మంగళవారం ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారు.. ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కోరిన కోరికలను నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కొందరు ఆంజనేయ స్వామిని మంగళవారం పూజిస్తే మరికొందరు శనివారం రోజు పూజిస్తూ ఉంటారు.. ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే కష్టాలన్నీ మాయం అవుతాయని పండితులు చెబుతున్నారు.. అవేంటో తెలుసుకుందాం..
ఆంజనేయస్వామికి 41 ఒక్క రోజు నియమంగా పూజిస్తే మంచిది.. హనుమాన్ ఆలయంలో ఉన్న రావి చెట్టుకు 11 సార్లు నిదానంగా నెమ్మదిగా తిరుగుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. స్త్రీలకు కొన్ని పరిస్థితుల వల్ల విరామం వచ్చినా కూడా ఆ తర్వాత రోజు నుంచి తిరిగి ప్రారంభించిన 41 రోజులు పూర్తి చేయాలి… స్వామికి పిండితో తయారు చేసిన దీపాన్ని పెట్టడం మంచిది.. అది కూడా రావి ఆకుపై వెలిగిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. దీపానికి పువ్వులు పసుపు కుంకుమతో అలంకరించి దీపాన్ని వెలిగించాలి. పిండితో చేసిన ప్రమిదలో కొంచం బెల్లం వేసి దానిపై వత్తి వేసి నూనె పోసి దీపం వెలిగిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు..
అనారోగ్య సమస్యలతో తరచూ బాధపడేవారు గోధుమలు తెల్ల నువ్వులు మినుములు, పెసలు బియ్యం ఈ ఐదింటిని పిండిలా చేసి ఆ పిండితో దీపాన్ని తయారు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పెళ్లి కానీ వాళ్లు బియ్యపు పిండితో ప్రమీదలను చెయ్యడం వల్ల చాలా మంచిది. వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.. వివాహం కావాలని అనుకొనేవారు.. ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి దాంతో దీపారాధన చేయాలి.. ఇలా ఒక్కో దీపంతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు..