NTV Telugu Site icon

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. మళ్లీ చక్రం తిప్పిన చిన్నమ్మ..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. తమిళనాడు రాజకీయాల్లో దివంగత నేత జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆమె కన్నుమూసిన తర్వాత కీలకంగా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత జైలు పాలయ్యారు.. అయితే, మళ్లీ చక్రం తిప్పింది చిన్నమ్మగా పిలుచుకునే శశికళ.. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. ఇప్పుడు శశికళ టీమ్‌తో కలసి పనిచేయడానికి సై అంటున్నారు.. ఈ రోజు అడియార్‌లోని టీటీవీ దినకర్‌ ఇంటిలో ఆయనతో సమావేశం అయ్యారు పన్నీర్‌ సెల్వం.. ఈ సమావేశంలో తమిళనాడులో తాజా పరిస్థితులు.. కలిసి ముందుకు సాగుదామని నిర్ణయానికి వచ్చారట..

Read Also: Pawan Kalyan: కేరళ బోటు ప్రమాదం విచారకరం.

అయితే, జయలలిత మరణించిన తర్వాత శశికళ ముఖ్యమంత్రి అయ్యే టైంలో తీవ్రంగా వ్యతిరేకించారు పన్నీరు సెల్వం.. ఆమెను వ్యతిరేకిస్తూ దీక్షకు దిగారు.. కానీ, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పళని స్వామి.. అన్నాడీఎంకే ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినా ఇద్దరూ కలిసి ముందుకు సాగారు.. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది అన్నాడీఎంకే.. తిరుగులేని విజయాన్ని సాధించింది డీఎంకే.. ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. అన్నాడీఎంకేలో ఎన్నో పరిణామాలు జరిగాయి.. క్రమంగా పార్టీపై పళని స్వామి పట్టు సాధించడంతో.. పళని దెబ్బకు ఉనికి కోల్పోయే పరిస్థితికి చేరాడు పన్నీరు సెల్వం.. ఇక, ఇప్పుడు దినకరన్.. పన్నీరు సెల్వం భేటీతో తమిళ రాజకీయాలు పరిణామాలు మారిపోతున్నాయి.. మరోసారి చక్రం తిప్పేందుకు చిన్నమ్మ అలియాస్‌ చిన్నమ్మ రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.