Tirumala Temple Rooms: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే.. మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌లైన్‌లో చేపట్టింది. దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే గదులు ఇవ్వడం ద్వారా.. భక్తుల రద్దీని కాస్త తగ్గించొచ్చని టీటీడీ భావిస్తోంది.
శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీడిప్, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ జనవరి 18 నుంచి 24 వరకు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) టికెట్లను భక్తులు 2.45 నిమిషాల్లోనే కొనుగోలు చేశారు.
Also Read: Microsoft : కొత్త రికార్డ్ నెలకొల్పిన మైక్రోసాఫ్ట్
మరోవైపు నేడు తిరుమలలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహిస్తున్నారు. ఉదయం 7.30 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా.. పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ్లారు. అక్కడ శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నైవేద్యాలు సమర్పిస్తారు. ఆపై భక్తులకు ప్రసాద వితరణ చేశారు.