NTV Telugu Site icon

Tirumala: ఇవాళ రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

Tirumala

Tirumala

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ బోర్డు ఇవాళ విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలలో దర్శనాల కోసం నేడు టికెట్లు జారీ చేయనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఏప్రిల్ నెల కోటా టికెట్లు విడుదల చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇక, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెల వసతి గదుల కోటా విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడానికి తమ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించాలని తిరుమల తిరుపతి బోర్డు సూచించింది. ఇక, తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ బోర్డు వెల్లడించింది.