Site icon NTV Telugu

TTD News: ధ్వజస్తంభాలు, రథాల కోసం 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టు!

Ttd

Ttd

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ పరిధిలోని ఆలయాలకు ధ్వజస్తంభాలు, రథాలు తయారు చేసేందుకు 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుకు పాలకమండలి ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు చెప్పారు. తిరుపతిలోని పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం సౌకర్యాల కల్పనకు రూ.48 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ నిర్మాణానికి ప్లానింగ్‌ కోసం ఆర్కిటెక్ట్‌ నియామకానికి ఆమోద ముద్ర వేశామని బీఆర్‌ నాయుడు చెప్పుకొచ్చారు. టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడారు.

Also Read: Liam Livingstone IPL: లక్కంటే లివింగ్‌స్టోన్‌దే.. ముందు అన్‌సోల్డ్‌, ఆపై కోట్ల వర్షం!

పాలకమండలి కీలక నిర్ణయాలు:
# టీటీడీలోని 31 విద్యాసంస్థలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు

# ముంబైలోని బాంద్రాలో 14.4 కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణం

# తలకోనలోని సిద్దేశ్వర ఆలయ నిర్మాణానికి 14 కోట్ల కేటాయింపు

# టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 60 పోస్టులు భర్తీకి నిర్ణయం

# కాటేజీ దాతల పాలసీలో సమగ్రంగా మార్పులు

# తిరుపతిలోని టీటీడీ పరిధిలోని రోడ్డులు అభివృద్ధికి నిధులు కేటాయింపు

# పోటులో 18 పోస్టులు నియామకంకు ప్రభుత్వానికి నివేదిక

# తిరుమలలో విధులకు పేర్లు నిర్ణయించడానికి కమిటీ ఏర్పాటు

# శ్రీవారి ఆలయంలో అదనంగా సన్నిధి యాదవ పోస్టు నియమాకంకు ఆమోదం

# టీటీడీ విద్యాసంస్థలలో మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభం

# టీటీడీ అనుభంద ఆలయాలో అర్చకులు, పరిచారకులు, పోటు కార్మికులు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు జీతాలు పెంపు

# నడకమార్గంలో ఉన్న కట్టడాలు పరిరక్షణ కోసం కమిటీ ఏర్పాటు

Exit mobile version