TTD Hundi: కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రతీరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు.. కొన్ని ప్రత్యేక సమయాల్లో అయితే, భక్తులతో తిరుమల గిరులు కళకళలాడుతుంటాయి.. తిరుమలకు వచ్చే భక్తులు భారీగా శ్రీవారి కానుకలు సమర్పిస్తుంటారు.. హుండీలో తమ కానుకలు వేస్తుంటారు.. ఇలా శ్రీవారికి హుండీ ద్వారా ప్రతీ రోజు కోట్లలో ఆదాయం వస్తుంటుంది. ఇక, తిరుమల వెంకన్నకు వరుసగా గత నెలలో కూడా ఆదాయం వంద కోట్ల మార్క్‌ని దాటింది.. వంద కోట్ల రూపాయలకు పైగా ఆదాయం రావడం ఇది వరుసగా 23వ నెల కావడం విశేషం.. మొత్తంగా జనవరి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.116 కోట్లుగా వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అయితే, గత ఏడాది జనవరితో పోలిస్తే మాత్రం మొత్తంగా 7 కోట్ల రూపాయలు తగ్గింది శ్రీవారి హుండీ ఆదాయం.
Read Also: Grama Panchayathi: నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన.. ప్రభుత్వం జీవో జారీ
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాదారణంగా కొనసాగుతోంది.. 9 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ పేర్కొంది.. ఇక, నిన్న 57,223 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. అందులో 18,015 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.44 కోట్లుగా వెల్లడించింది టీటీడీ.