NTV Telugu Site icon

TTD Board Meeting: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. వార్షిక బడ్జెట్‌కు ఆమోదం!

Ttd Meeting

Ttd Meeting

TTD Board Meeting: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం కాబోతుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలుపనుంది. 5 వేల కోట్ల రూపాయల అంచనాతో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. గత ఏడాదితో పోలిస్తే హుండీ ఆదాయం దాదాపు 100 కోట్ల రూపాయలు తగ్గినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, 2023-2024 ఏడాదికి గానూ 4 వేల 411 కోట్లు బడ్జెట్‌ను టీటీడీ కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్ ఎంత ప్రవేశపెడతారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో పాటు ఫిబ్రవరి 16న నిర్వహించనున్న రథసప్తమి ఏర్పాట్లపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ భేటీలోనే టీటీడీ విశ్రాంతి ఉద్యోగుల ఇళ్ల స్థలాల మంజూరుపై ఓ ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. కాగా.. గత కొంత కాలంగా ఇళ్లు స్థలాల మంజూరు కార్యక్రమం వాయిదా పడుతూ వస్తుంది.