తిరుమల తిరుపతి పాలకమండలి పదవీకాం రేపటితో ముగుస్తుంది. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలో ఇవాళ చివరి సమావేశం జరుగనుంది. టీటీడీ కొత్త ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని ప్రభుత్వం ఇప్పటికే నియమిస్తూ జీవో జారీ చేసింది. వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే రెండు సార్లు.. నాలుగేళ్ల కాలం పాటు టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక, ఈ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: WI vs IND: చెలరేగిన నికోలస్ పూరన్.. రెండో టీ20లోనూ భారత్ ఓటమి!
రేపటితో వైవీ సుబ్బారెడ్డి పదవికాలం ముగుస్తుంది. ఈ రోజు వైవీ అధ్యక్షతన ఆఖరి పాలకమండలి సమావేశం తిరుమల అన్నమయ్య భవన్ లో జరగనుంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 29 మంది సభ్యులు ఉన్న పాలకమండలి ఆఖరి సమావేశంగా భేటీ కానుంది. పలు కీలక తీర్మానాలపై చర్చించనుంది. కొత్త పాలక మండలి చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎంపికయ్యారు. విధేయత అనుభవం భూమనకు అనుకున్న పదవి దక్కేలా చేసింది. ఇప్పటికే 2004 నుంచి 2006 వరకు పాలక మండలి సభ్యుడుగా, 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా కొనసాగిన భూమన ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే గా టీటీడీ బోర్డులో స్పెషల్ ఇన్వైటీగా ఉన్నారు.
Read Also: Maruti Suzuki: మారుతి సుజుకి విజన్ 3.0 విడుదల.. 2031నాటికి 1.5మిలియన్ కార్ల ఉత్పత్తి
అయితే, ఇప్పుడు చైర్మన్ గా రెండోసారి శ్రీవారి ప్రథమ సేవకుడిగా బాధ్యతలను భూమన కరుణాకర్ చేపట్టబోతున్నారు. అప్పుడు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఇప్పుడు కొడుకు జగన్ సీఎంగా ఉన్నప్పుడు రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా పనిచేసే అదృష్టం ఎవరికీ రాదు భూమన అన్నారు. టీటీడీ పట్ల పూర్తి అవగాహన ఉందంటున్న భూమన చైర్మన్ గా హిందూ ధార్మిక వ్యాప్తి కోసమే పనిచేస్తానని తెలిపారు.
Read Also: Sreemukhi: మీది నాది సేమ్ పించ్ అంటూ చిరంజీవికి లవ్ ప్రపోజ్ చేసిన శ్రీముఖి..
టీటీడీ కొత్త చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఈ నెల 10న బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11.44 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి వద్ద చైర్మన్ గా రెండోసారి భూమన శ్రీవారి ప్రథమ సేవకుడిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. టీటీడీ చైర్మన్ గా ప్రభుత్వం భూమనను ప్రకటించడంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి తో పాటు టీటీడీ యంత్రాంగమంతా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.