Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం పోటెత్తుతూనే ఉంటారు భక్తులు.. ఇక, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతీ నెల ఆన్‌లైన్ విడుదల చేసే.. ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు.. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లు కూడా నిమిషాల వ్యవధిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతూనే ఉన్నాయి.. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితే చోటు చేసుకుంది.. సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది టీటీడీ.. దీంతో.. గంటా 25 నిముషాల వ్యవధిలోనే ఆర్జిత సేవా టికెట్ల కోటాను పూర్తి చేశారు భక్తులు.. ఇక, 2 నిముషాల 30 సెంకడ్ల వ్యవధిలోనే అంగప్రదక్షణ టికెట్లు పూర్తిగా బుక్ చేసుకున్నారు.. 10 నిముషాల 11 సెకండ్ల వ్యవధిలోనే వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ల కోటా పూర్తి చేశారు.. మరోవైపు.. శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 2 గంటల 6 నిముషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో బుక్‌చేసుకున్నారు. గంటా 40 నిముషాల వ్యవధిలోనే వసతి గదుల కోటాను పొందారు భక్తులు.. కాగా, వేసవి సెలవులు ముగిసి.. స్కూళ్లు ప్రారంభం అయినా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోన్న విషయం విదితమే.
Read Also: Bhatti Vikramarka: తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు..