Site icon NTV Telugu

YV Subba Reddy: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిమాణం.. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి సిట్ బృందం..

Yv Subba Reddy Press

Yv Subba Reddy Press

YV Subba Reddy: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని వైవీ సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారుల బృందం చేరుకుంది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఆయన ఇంట్లోనే విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఎ చిన్న అప్పన్నతో పాటు టీటీడీ మాజీ ఈవో, పలువురు అధికారులను విచారించింది సిట్.. వారి స్టేట్మెంట్ల ఆధారంగా వైవీ సుబ్బారెడ్డిని విచారిస్తోంది. సిట్ అధికారులు స్టేట్మెంట్స్ తో పాటు పలు డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. వాటిని ముందుంచి వైవీ సుబ్బారెడ్డిని విచారించారు. లంచ్ విరామం అనంతరం మరోసారి విచారించనున్నారు.

READ MORE: Ustaad Bhagat Singh: ఉస్తాద్ కోసం మరో డేట్?

కాగా.. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిన కేసులో నిందితుడైన చిన్న అప్పన్న(ఏ24)ను సిట్ ఇటీవల విచారించింది. గత నెల చివర్లో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ నేపథ్యంలో తమ కస్టడీకి అప్పగించాలని నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, ఐదు రోజుల పాటు విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఈ క్రమంలో సోమవారం(నవంబర్ 17)న ఉదయం నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి చిన్న అప్పన్నను తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకొచ్చి, వైద్య పరీక్షల అనంతరం విచారించారు.

READ MORE: 120X జూమ్, 7000mAh బ్యాటరీ, 200MP టెలిఫోటో, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ లతో Realme GT8 Pro లాంచ్..!

Exit mobile version