CMD Musharraf Ali Faruqui: హైదరాబాద్ నగరంతో పాటు ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు, భారీ గాలుల నేపథ్యంలో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం సరఫరా సాధారణ స్థాయిలో వున్నదని తెలిపారు. భారీ గాలుల వల్ల చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీల అవశేషాలు, ఇతర భవన నిర్మాణ సామాగ్రి, ఇతర వస్తువులు గాలి ధాటికి విద్యుత్ లైన్లపై పడే అవకాశమున్నందున సాధారణ ప్రజలు, వినియోగదారులు వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలు పడేటప్పడు సాధారణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు క్రింద సూచించిన స్వీయ జాగ్రత్తలు పాటించాలని సీఎండీ కోరారు.
1.వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల క్రింద, ట్రాన్సఫార్మర్ల వద్ద నిలబడరాదు. వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండాలి. పశువులను, పెంపుడు జంతువులను కూడా విద్యుత్ పరికరాల నుండి దూరంగా ఉంచాలి.
2. ఎక్కడైనా రోడ్ మీద, నీటిలో కాని విద్యుత్ తీగ పడి వున్న యెడల ఆ తీగను తొక్కడం గాని, వాటి మీద నుండి వాహనాలు నడపడం చేయరాదు. ఒక వేళ ఎక్కడైనా తెగిపడ్డట్టు ఉంటే వెంటనే సమీప విద్యుత్ సిబ్బందికి గాని, కింద ఇవ్వబడ్డ నెంబర్ల ద్వారా సంస్థ దృష్టికి తీసుకు రాగలరు.
3. చెట్ల కొమ్మలపై, వాహనాలపై, ఇతర భవనాలపై తెగి పడ్డ తీగలు ఉన్నట్లయితే వెంటనే సంస్థ దృష్టికి తీసుకురావాలి.
4. భారీ గాలులు, వర్షం పడేటప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే విద్యుత్ పరికరాలను ఆఫ్ చేసి వెంటనే కంట్రోల్ రూమ్ కి తెలియజేయగలరు.
5. విద్యుత్ అంతరాయం ఫిర్యాదుల నమోదు కోసం కంట్రోల్ రూమ్‌ను సంప్రదించే వినియోగదారులు తమ బిల్లుపై ముద్రితమైన USC నెంబర్‌ను సిద్ధంగా వుంచుకోగలరు.
6. లోతట్టు ప్రాంతాల్లో, అపార్ట్మెంట్ సెల్లార్ లలో నీళ్ళు చేరితే వెంటనే అధికారులకు తెలియజేయాలి.
7. విద్యుత్‌కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు క్రింద పేర్కొన్న సంబంధిత సర్కిల్ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలరు.