TGSRTC : ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం కారణంగా విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు, చెన్నైకు నేరుగా స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసింది.
JEE Advanced 2026 Exam Date: విద్యార్థులకు అలర్ట్.. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష తేదీ వచ్చేసింది..
వీకెండ్ కావడంతో ఐటీ ఉద్యోగులు అధిక సంఖ్యలో చెన్నై, బెంగళూరు వంటి నగరాల వైపు ప్రయాణించే అవకాశం ఉండటంతో ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఐటీ ఉద్యోగులతో పాటు ఇతర ప్రయాణికులకు కూడా ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక సర్వీసులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సులు శనివారం సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ప్రస్తుతం రెండు స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని, అవసరమైతే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని సర్వీసులు కూడా నడపనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Aryan Khan FIR: బాలీవుడ్ స్టార్ కుమారుడిపై కేసు.. ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసిన సంఘటన..
