సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం వేరే ఊర్లో ఉన్నా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంటుంది. అయితే.. సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది టీఎస్‌ఆర్టీసీ. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) 2023 సంక్రాంతి సందర్భంగా జనవరి 7 నుండి 15 వరకు 4,233 ప్రత్యేక బస్సులను నడపనుంది. ప్రత్యేక బస్సులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇతర పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల మధ్య పనిచేస్తాయి. సంక్రాంతికి రవాణా ఏర్పాట్లపై టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, వీసీ సజ్జనార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Also Read : Indian Racing League : మరోసారి మారిన క్వాలిఫై రేసింగ్ టైం
టీఎస్‌ఆర్టీసీ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 10 శాతం బస్సులను అదనంగా నడుపుతున్నట్లు తెలిపారు. అమలాపురంకు 125, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నంకు 65, పోలవరానికి 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులను కేటాయించినట్లు టీఎస్‌ఆర్టీసీ పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక బస్సుల్లో 585 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా ఉంటుందని చెప్పారు. తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు కూడా పండుగ సమయంలో ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి ఆర్టీసి బస్సుల్లో ప్రయాణాలకు రిజర్వేషన్లను 60రోజుల ముందు నుంచి వర్తింపచ చేయనున్నారు. గతంలో రిజర్వేషన్ సదుపాయం 30రోజుల ముందు మాత్రమే అందుబాటులో ఉండేది.
