NTV Telugu Site icon

TSRTC: కండక్టర్లపై దాడి చేసిన మ‌హిళా ప్రయాణికురాలు.. ఆర్టీసీ ఎండీ వార్నింగ్..!

Sajjnor

Sajjnor

హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు దుర్భషలాడుతూ దాడి చేసిన ఘటనపై టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది అని ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఇక, ఈ ఘటనపై ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బస్సు మొదటి ట్రిప్పు వెళ్తుంది తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ ఆ మహిళా విన్నవించిన ఏమాత్రం వినకూండా దాడి చేసింది. అంతే కాకుండా ఆమె అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించింది. అలాగే, కండెక్టర్ ను త‌న కాలితో త‌న్నింది.. తాను మర్డర్లు చేస్తా.. నిన్ను చంపేస్తా అంటూ బెదిరింపులకు దిగింది. ఇక, ఆమెను నిలువ‌రించేందుకు మ‌రో మ‌హిళా కండక్టర్ ట్రై చేసినప్పటికి ఆమె ప‌ట్ల కూడా మహిళా ప్రయాణికురాలు దురుసుగా ప్రవర్తించింది.

Read Also: IND vs ENG: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. విరాట్‌ కోహ్లీ దూరం!

అయితే, నిబద్దతతో సమర్థవంతంగా డ్యూ చేస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించిన, దాడులకు దిగే వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో డ్యూలు చేస్తున్నారు.. వారికి సహకరించి క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.