Site icon NTV Telugu

RTC MD Sajjanar: ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ ఎండీ కారు.. సజ్జనార్‌కు స్వల్పగాయాలు

Sajjanar Car Accident

Sajjanar Car Accident

RTC MD Sajjanar: సీనియర్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు ఆటోను ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సజ్జనార్ మహారాష్ట్రకు వెళుతుండగా ధర్మారం క్రాస్ రోడ్ వద్ద రామగుండం వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా రాజీవ్ రహదారి పైకి అడ్డంగా రావడంతో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది.

puducherry: అంధకారంలో పుదుచ్చేరి.. గవర్నర్, సీఎం ఇళ్లకు పవర్ కట్

ఈ ప్రమాదంలో రామగుండం మండలం మల్యాల పల్లి గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మిలకు తీవ్ర గాయాలు కాగా.. అంతర్గాం మండలం రాయబండి గ్రామానికి చెందిన నూనె భూమయ్య, నూనె లక్ష్మిలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుడి చేతి వేలుకు గాయమైంది.

Exit mobile version