NTV Telugu Site icon

TSRTC: మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

Rtc Bus

Rtc Bus

మహిళా ప్రయాణికులకు తెలంగాణ స్టేట్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును టీ.ఎస్.ఆర్టీసి ఏర్పాటు చేసింది. 127K నంబర్ బస్సు మహిళల కోసం ప్రత్యేకంగా నడిపిస్తున్నారు. లేడీస్ స్పెషల్ బస్సు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్డీకాపుల్, మాసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగం పేట, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా కొండాపూర్ కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది అని సజ్జనార్ వెల్లడించారు. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్ఆర్టీసీ సంస్థ ఎండీ విసీ సజ్జనార్ కోరారు.

Read Also: Aadhaar Card: ఆధార్‌ అప్‌డేట్‌పై యూఐడీఏఐ వార్నింగ్‌.. ఇలా చేస్తే అంతే..!

ఇదిలా.. ఉంటే హైదరాబాద్ లో మహిళల కోసం ప్రత్యేక బస్సులు కొత్తేం కాదు.. గతంలోనూ ఆర్టీసీ ఆర్డినరీ బస్సులను సైతం కొన్ని ఎంపిక చేసిన రూట్లలో తిరిగేవి. అయితే, కాలక్రమేణా అవి తగ్గిపోతూ వచ్చాయి. ఇక, చాలాకాలం తర్వాత నగరవాసులకు సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో అదే టైంలో మెట్రో రైలు.. ఆర్టీసీ ఆదాయంపై ఎఫెక్ట్ పడింది. దీంతో సజ్జనార్ టీఎస్ఆర్టీసీ ఎండీ అయ్యాకా.. ఆక్యుపెన్సీని పెంచేందుకు రకరకాల పద్దతులను తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు బస్సు ప్రయాణాలకు ప్రాధాన్యత ఇచ్చేలా వెరైటీ స్కీమ్స్ తీసుకొస్తున్నాడు.

Read Also: Rahul Gandhi: కూరగాయల వ్యాపారికి భోజనం వడ్డించిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్