Site icon NTV Telugu

Group-1 Prelims Key: నేడు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కీ..

Tspsc Group 1 Key 2024

Tspsc Group 1 Key 2024

Group-1 Prelims Key: తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని నేడు విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈరోజు వెబ్‌సైట్‌లో మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు ఆన్సర్ కీ కూడా అందుబాటులో ఉంచబడుతుంది. ఆన్సర్ కీపై అభ్యంతరాలను జూన్ 17 వరకు స్వీకరిస్తారు.ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల‌ను 13వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఈమెయిల్ ద్వారా వ‌చ్చే అభ్యంత‌రాల‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని టీజీపీఎస్సీ అధికారులు స్ప‌ష్టం చేశారు. ఆ తర్వాత ఫైనల్ కీతో పాటు ఫలితాలు విడుదల చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.

Read also: Schools Reopen: ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అయితే వీరిలో 3.02 లక్షల (74 శాతం) అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే దాదాపు లక్ష మంది పరీక్షకు హాజరు కాలేదు. ప్రిలిమ్స్ ఫలితాల ప్రకటన తర్వాత, మల్టీ జోన్, రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మందిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తామని కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Boat Capsizes: కాంగోలో పడవ బోల్తా.. 86 మంది మృతి

Exit mobile version