Site icon NTV Telugu

TSPSC Group-1 Final Results: గ్రూప్-1 ఉద్యోగాల ఫైనల్ ఫలితాలు విడుదల.. 562 అభ్యర్థుల ఎంపిక

Tspsc Group 1

Tspsc Group 1

TSPSC Group-1 Final Results: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGSPSC) ఇటీవల గ్రూప్-1 ఉద్యోగాల తుది ఎంపిక ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష గత ఏడాది అక్టోబర్ 21 నుండి 27 వరకు జరిగింది. మొత్తం 563 ఖాళీలలో, ఒక పోస్టుపై హైకోర్టులో విచారణ ఉన్నందున 562 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-1 నియామకాలు జరగడం ఇదే మొదటిసారి. ఈసారి, టాప్-10 ర్యాంకర్లలో ఆరుగురు మహిళలు ఉండటం విశేషం. ముఖ్యంగా తొలి ర్యాంకు సాధించిన లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, జిన్నా తేజస్విని, వంశీకృష్ణారెడ్డి, కృతిక, అనూష, హర్షవర్ధన్, శ్రీకృష్ణసాయి, నిఖిత, భవ్య.. అత్యున్నత పోస్టులైన డిప్యూటీ కలెక్టర్ (RDO) పోస్టులకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా లిస్ట్ టీఎస్‌పీఎస్సీ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.

They Call Him OG Review: ఓజీ రివ్యూ.. పవన్ మార్క్ బ్లడ్ బాత్

ఇక ఉస్మానియా యూనివర్శిటీలో మెడిసిన్ పూర్తి చేసిన లక్ష్మీదీపిక, 900 మార్కులకు 550 మార్కులు సాధించి మొదటి ర్యాంకులో నిలిచారు. అలాగే, ఇప్పటికే మండల పంచాయతీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తేజస్విని మల్టీజోన్-1 కేటగిరీలో 532 మార్కులతో ఆర్డీవో పోస్టును సాధించారు. మొత్తం మీద జనరల్ మెరిట్ ర్యాంకులలో టాప్-10లో ఆరుగురు, టాప్-50లో 25 మంది, టాప్-100లో 41 మంది మహిళలు ఉన్నారు.

Astrology: సెప్టెంబర్‌ 25, గురువారం దినఫలాలు.. ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?

Exit mobile version