TSLPRB Recruitment 2026: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 7,437 ఖాళీల భర్తీకి దరఖాస్తు తేదీల ప్రకటన..!

Ts Police Recruitment 2022

Ts Police Recruitment 2022

TSLPRB Recruitment 2026: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) ద్వారా పోలీస్‌, ఎస్‌పీఎఫ్‌, ఫైర్‌ సర్వీసెస్‌, జైళ్ల శాఖల్లోని మొత్తం 7,437 ఖాళీల భర్తీకి సంబంధించి దరఖాస్తులకు తేదీలు ప్రకటించారు. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 19, 2026 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్‌ 9, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను బోర్డు అధికారిక వెబ్‌సైట్ tgprb.in ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఇతర మార్గాల్లో పంపే దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఈ నియామక ప్రక్రియ కోసం అభ్యర్థులు ఒకేసారి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో దరఖాస్తు, ప్రాసెసింగ్‌ ఛార్జీలతో పాటు పరీక్షల నిర్వహణ, బయోమెట్రిక్ నమోదు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ఫలితాల ప్రాసెసింగ్‌కు సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయి.

ఎంపిక విధానం విషయానికి వస్తే, ముందుగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు. పీసీ, ఎస్‌ఐ స్థాయి పోస్టులకు 3 గంటల పాటు ఈ పరీక్ష ఉంటుంది, అయితే టెక్నికల్‌ పోస్టులకు ప్రిలిమ్స్ ఉండదు. ఇందులో అర్హత సాధించిన వారికి ఆధునిక డిజిటల్ పరికరాల ద్వారా ఫిజికల్‌ మెజర్‌మెంట్‌/ఎఫిషియెన్సీ టెస్టులు (PMT/PET) నిర్వహిస్తారు. ఎస్‌సీటీ పీసీ (మెకానిక్‌/డ్రైవర్‌) పోస్టులకు ఫిజికల్ టెస్టుల తర్వాత ట్రేడ్ లేదా డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. చివరి దశలో తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. పీసీ స్థాయికి ఒకే పరీక్ష ఉండగా, ఎస్‌ఐ స్థాయికి రెండు డిస్క్రిప్టివ్ పేపర్లతో సహా మొత్తం నాలుగు పరీక్షలు (ఒక్కొక్కటి 3 గంటలు) ఉంటాయి. నియామక ప్రక్రియలోని అన్ని దశల్లోనూ అభ్యర్థుల బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి.