NTV Telugu Site icon

TS TRT 2023 : 5089 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే దరఖాస్తులు..

Whatsapp Image 2023 09 20 At 11.31.57 Am

Whatsapp Image 2023 09 20 At 11.31.57 Am

తెలంగాణ రాష్ట్రం లో డీఎస్సీ ద్వారా టీచర్‌ ఉద్యోగాల భర్తీ చేయాలనీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఉద్యోగాలను కొత్త రోస్టర్‌ ప్రకారం నియమించాలని కూడా నిర్ణయించింది. నూతన జిల్లాల ఏర్పాటుతో పాత రోస్టర్‌కు ముగింపు పలికి రోస్టర్‌ను 1వ పాయింట్‌ నుంచి ప్రారంభించనుంది.. దీంతో కొత్త రిజర్వేషన్‌ విధానం అమల్లోకి రానుంది.. ఈ కొత్త రోస్టర్‌ను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. పోస్టుల వారీగా రోస్టర్‌ రిజర్వేషన్‌ను పాఠశాల విద్యాశాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది.. అభ్యర్థులు మంగళవారం రాత్రి 12 గంటల నుంచే దరఖాస్తు చేసుకొనే అవకాశం విద్యా శాఖ వారు కల్పించారు. వచ్చే నెల 21 వరకు ఆన్‌లైన్‌లో టీఆర్టీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు స్థానికసంస్థల బడుల్లో 5,089 పోస్టుల భర్తీకి ఇటీవల పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, భాషాపండితులు, పీఈటీ పోస్టులున్నాయి. డీఎస్సీ ద్వారా భర్తీచేసే ఉపాధ్యాయ పోస్టుల్లో 51శాతం పోస్టులు మహిళలకే రిజర్వ్‌ అయి వున్నాయి..ఎక్కువ భాగం పోస్టులు వారికే దక్కనున్నాయి.ఇవే కాకుండా ఇక ఓపెన్‌ జనరల్‌ కేటగిరిలో కూడా వారు పోటీ పడే అవకాశం ఉన్నది. ఓపెన్‌ జనరల్‌ కోటాలో మరో 2,451పోస్టులను ఇప్పటికే రిజర్వ్‌చేశారు. ఓపెన్‌ జనరల్‌ కోటా పోస్టుల్లో పురుషులతో పాటు, మహిళలు పోటీపడే అవకాశం ఉన్నది. ఈ పోస్టులను మెరిట్‌ అధారంగా అయితే భర్తీ చేస్తారు. దాదాపు 24 జిల్లాల్లో అత్యధిక పోస్టులు మహిళలకే రిజర్వ్‌ అయ్యాయి. హనుమకొండ జిల్లాలో 54 పోస్టుల్లో 40 పోస్టులు, పెద్దపల్లి జిల్లాలో 43 పోస్టులలో, 31 పోస్టులు మహిళామణులకే రిజర్వ్‌చేశారు. తక్కువ జిల్లాల్లోని పోస్టుల్లో మహిళలకే రిజర్వ్‌ చేయడం జరిగింది.. ఈ సారి మహిళా అభ్యర్థుల కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతని ఇచ్చింది.