TS TRT 2023 : 5089 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే దరఖాస్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రం లో డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల భర్తీ చేయాలనీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఉద్యోగాలను కొత్త రోస్టర్ ప్రకారం నియమించాలని కూడా నిర్ణయించింది. నూతన జిల్లాల ఏర్పాటుతో పాత రోస్టర్‌కు ముగింపు పలికి రోస్టర్‌ను 1వ పాయింట్ నుంచి ప్రారంభించనుంది.. దీంతో కొత్త రిజర్వేషన్ విధానం అమల్లోకి రానుంది.. ఈ కొత్త రోస్టర్‌ను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. పోస్టుల వారీగా రోస్టర్ రిజర్వేషన్‌ను పాఠశాల విద్యాశాఖ తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది.. అభ్యర్థులు మంగళవారం రాత్రి 12 గంటల నుంచే దరఖాస్తు చేసుకొనే అవకాశం విద్యా శాఖ వారు కల్పించారు. వచ్చే నెల 21 వరకు ఆన్లైన్లో టీఆర్టీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు స్థానికసంస్థల బడుల్లో 5,089 పోస్టుల భర్తీకి ఇటీవల పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషాపండితులు, పీఈటీ పోస్టులున్నాయి. డీఎస్సీ ద్వారా భర్తీచేసే ఉపాధ్యాయ పోస్టుల్లో 51శాతం పోస్టులు మహిళలకే రిజర్వ్ అయి వున్నాయి..ఎక్కువ భాగం పోస్టులు వారికే దక్కనున్నాయి.ఇవే కాకుండా ఇక ఓపెన్ జనరల్ కేటగిరిలో కూడా వారు పోటీ పడే అవకాశం ఉన్నది. ఓపెన్ జనరల్ కోటాలో మరో 2,451పోస్టులను ఇప్పటికే రిజర్వ్‌చేశారు. ఓపెన్ జనరల్ కోటా పోస్టుల్లో పురుషులతో పాటు, మహిళలు పోటీపడే అవకాశం ఉన్నది. ఈ పోస్టులను మెరిట్ అధారంగా అయితే భర్తీ చేస్తారు. దాదాపు 24 జిల్లాల్లో అత్యధిక పోస్టులు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. హనుమకొండ జిల్లాలో 54 పోస్టుల్లో 40 పోస్టులు, పెద్దపల్లి జిల్లాలో 43 పోస్టులలో, 31 పోస్టులు మహిళామణులకే రిజర్వ్‌చేశారు. తక్కువ జిల్లాల్లోని పోస్టుల్లో మహిళలకే రిజర్వ్ చేయడం జరిగింది.. ఈ సారి మహిళా అభ్యర్థుల కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతని ఇచ్చింది.
Also Read
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
- Tags
- #ts trt
- applications
- TS Govt
తాజావార్తలు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!