TS TET : ఎల్లుండే తెలంగాణ టెట్ ఎగ్జామ్.. అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహణకు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.టెట్ ఎగ్జామ్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుంచి హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ నెల 27వ తేదీన పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.. ఈ క్రమంలోనే ఎగ్జామ్ కు సంబంధించి విద్యాశాఖ కొన్ని ముఖ్య సూచనలను జారీ చేసింది. ఎగ్జామ్ సెంటర్ అడ్రస్‌ని ఒక రోజు ముందుగానే అభ్యర్థులు చూసుకోవాలని తెలిపింది. ఎగ్జామ్ హాల్‌లోకి హాల్ టికెట్ తప్ప మరి ఏ ఇతర వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకుకూడదని తెలియజేసింది.. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అందులో వివరాలను సరి చూసుకోవాలి. హాల్‌టికెట్‌పై ఫొటో, సిగ్నేచర్ సరిగ్గా లేకపోతే అభ్యర్థులు.. ఫొటోను అతికించి గెజిటెడ్ ఆఫీసర్‌తో సంతకం చేయించుకొని, ఆధార్ కార్డు, ఇతర ఐడీతో సంబంధిత జిల్లా డీఈవోను సంప్రదించాలని తెలియజేసింది.. డీఈవో అనుమతి ఇచ్చినాకే ఎగ్జామ్ కు పర్మిషన్ ఇవ్వడంలో తగు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది..
ఎగ్జామ్ కు గంట ముందే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతి ఇస్తారు. అభ్యర్థి పేరులో దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, జెండర్, డిసేబిలిటీ వంటి వివరాలు సరిగా లేకుంటే పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలని తెలియజేసింది.మొదటి పేపర్ ఎగ్జామ్ కు సంబంధించి మధ్యాహ్నం 12 తర్వాత మాత్రమే బయటికి పంపిస్తారు. సాయంత్రం ఎగ్జామ్ కు సంబంధించి 5 తర్వాత మాత్రమే హాల్ నుంచి అభ్యర్థులను బయటికి అనుమతిస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు పరీక్ష హాలులోకి అనుమతి ఉండదు. ఎగ్జామ్ హాల్‌లో ఇబ్బందులు సృష్టిస్తే అలాంటి అభ్యర్థులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. టెట్ పేపర్ 1 ఎగ్జామ్ ను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ కోసం 2,83,620 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇందులో పేపర్-1 కు 80,990.. పేపర్-2కు 20,370 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. మొత్తం రెండు పేపర్లకు కలిపి దాదాపు 1,82,260 దరఖాస్తులు వచ్చాయి
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
- Tags
- instructions
- TS Govt
- ts tet
తాజావార్తలు
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!