Site icon NTV Telugu

TS SET 2024: తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా..

Ts Set 2024

Ts Set 2024

తాజాగా తెలంగాణ సెట్ – 2024 నోటిఫికేషన్ విడుదలయింది. శనివారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రిలు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇక ఈ పరీక్షకు సమబంధించి ముఖ్య తేదీలను ప్రకటించారు. ఈ ఏడాది కూడా పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను అధికారులు నిర్వహిస్తున్నారు.

Also Read: Virat Kohli – DK: దినేష్ కార్తీక్ ముందు తలవంచిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్..

ఈ పరీక్షకు గాను మే14వ తేదీ నుంచి తెలంగాణ సెట్ దరఖాస్తులు మొదలు కానున్నాయి. ఆన్ లైన్ లోనే ఈ దరఖాస్తులను సమర్పించాలి. జూలై 2వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఒకవేళ ఫైన్ తో జూలై 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 20వ తేదీ నుంచి పరీక్ష హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతారు. ఆగస్టు 28 నుంచి పరీక్షలు మొదలైతాయి. ఆగస్టు 31వ తేదీతో పరీక్షలు ముగుస్తాయని తెలంగాణ సెట్ అధికారులు తెలిపారు. http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను చూడవచ్చు. తెలంగాణ సెట్ ను 2 పేపర్లలో నిర్వహించనున్నారు అధికారులు. పేప‌ర్-1 లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు ఉండగా., పేప‌ర్-2 లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులతో పరీక్షలను నిర్వహిస్తారు. కంప్యూట‌ర్ బేస్డ్ ప‌ద్ధతిలో 3 గంటల పాటు ప‌రీక్షను నిర్వహిస్తారు.

Also Read: After 9 Pub: బంజారాహిల్స్ ‘ఆఫ్టర్ నైన్ పబ్’ లో గలీజ్ దందా.. యువకులను ఆకర్షించేందుకు ఏకంగా..

ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న విషయానికి వస్తే.. అభ్యర్థులు ముందుగా http://telanganaset.org/index.htm వెబ్ సైట్ లోకి వెళ్లి., “TS SET Apply Online” ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు దరఖాస్తు ఫామ్ ఓపెన్ కాగా, అందులో మీ వివరాలతో పాటు విద్యార్హతలను ఎంటర్ చేసి, మీరు ఎగ్జామ్ సెంటర్ ను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆపై నిర్ణయించిన అప్లికేషన్ రుసుం చెల్లించాలి. ఇందుకోసం ఆన్లైన్ పేమెంట్ అందుబాటులో ఉంటుంది. ఇక చివరగా Submit బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఆపై ‘ప్రింట్ ఆప్షన్’ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.

Exit mobile version