Site icon NTV Telugu

TRS Party: తెలంగాణలో కొత్తగా ‘టీఆర్ఎస్’ పేరుతో రాజకీయ పార్టీ…?

Trs

Trs

TRS Party: బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కొత్త రాజకీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి పయనమయ్యారు. తెలంగాణ సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మార్చుకుని.. కేసీఆర్ వదిలేసిన టీఆర్ఎస్ పేరుతో రాష్ట్రంలో కొంతమంది కొత్త పార్టీ తీసుకువస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో రిజిస్ట్రేషన్ కు ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే దీని వెనుక ఎవరున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకోనుందని ప్రచారం.

Read Also: Great Father: బిడ్డకు సాయం చేసినా తప్పేనా సారు.. జర సోచాయించుర్రి

అయితే, ఈ కొత్త టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోని కొందరు కీలకనేతలు సారథ్యం వహించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు అసంతృప్త నేతలు ఈ పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఇప్పటికే తెర వెనుక పార్టీకి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయని చెబుతున్నారు. ఆ ముగ్గురు నేతలెవరు అన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ముగ్గురు మాజీ టీఆర్ఎస్ నేతలంటున్నారు. టీఆర్ఎస్ పేరుతో మరో పార్టీ ఉంటే అది బీఆర్ఎస్‌కే నష్టమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Exit mobile version