తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఐఈ) శనివారం జూనియర్ కాలేజీలకు జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 17న కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. అన్ని జూనియర్ కళాశాలలకు – ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు అన్ ఎయిడెడ్, కో-ఆపరేటివ్, TS రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, BC వెల్ఫేర్, KGBVలు మరియు ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలకు సెలవు వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ అన్ ఎయిడెడ్‌లు సంక్రాంతి సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని కాలేజీ యాజమాన్యాలను బోర్డు ఆదేశించింది . సూచనలను ఉల్లంఘిస్తే సీరియస్‌గా చూస్తామని, తప్పు చేసిన మేనేజ్‌మెంట్‌లపై డిస్‌ఫిలియేషన్‌తో సహా చర్యలు తీసుకుంటామని టీఎస్ బీఐఈ తెలిపింది.
Sankranti Holidays : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డ్

Interboard