Site icon NTV Telugu

TS Inter : ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త.. మెమోలు రెడీ..

Ts Inter Board

Ts Inter Board

తెలంగాణలో ఈ సంవత్సరం ఇంటర్‌ పరీక్షలు రాసి మెమోల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు శుభవార్త చెప్పింది. జూన్‌లో ఫలితాలు విడుదలైనప్పుడు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న షార్ట్‌మెమో మార్కుల జాబితాలతో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులపై ఒరిజనల్‌ మార్కుల మెమోల కోసం కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు టెన్షన్‌కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఇంటర్‌ బోర్డు ఈ ఏడాది మే నెలలో రాసిన ఇంటర్‌ పరీక్షల మెమోలతో పాటు.. ఆగస్టులో రాసిని సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన మెమోలను సైతం ఆయా ఇంటర్‌ కాలేజీల యాజమాన్యాలకు పంపించింది.
Also Read : lohitashwa prasad: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడి కన్నుమూత

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంటర్‌ బోర్డు జాయింట్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. అయితే.. పాసైన విద్యార్థులు తమ లాంగ్‌ మెమోలను వారి కళాశాలకు వెళ్లి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే.. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూన్‌లో విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32 శాతం, ద్వితీయ సంవత్సరంలో 67.82 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే.. పాస్‌ కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.

Exit mobile version