Site icon NTV Telugu

​Inter Exam Fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు చెల్లింపు గడువు పెంపు..

Inter Exam Feeeee

Inter Exam Feeeee

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఊరటనిస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు చెల్లింపు గడువును పెంచుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ప్రకటించిన వివరాల ప్రకారం.. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించే గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించారు. వాస్తవానికి ఈ గడువు అంతకుముందే ముగియాల్సి ఉన్నప్పటికీ.. విద్యార్థులు , తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు బోర్డు ఈ వెసులుబాటు కల్పించింది.

ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మార్కులు తక్కువగా వచ్చి, ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవాలనుకునే కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా.. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవడానికి ఈ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. జనరల్ మరియు వొకేషనల్ కోర్సుల విద్యార్థులందరికీ ఈ అవకాశం వర్తిస్తుంది.

Also Read:Jeevan Reddy : పార్టీకి ఎప్పుడూ కీడు చేయలేదు.. బయటకు అందుకే వచ్చా..!

ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగానే విద్యార్థులు ఉన్నత చదువులకు (డిగ్రీ, ఇంజనీరింగ్ మొదలైనవి) ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇది విద్యార్థులకు చాలా కీలకం. గడువు పొడిగింపు అనేది చివరి అవకాశం కావచ్చని.. కాబట్టి ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు ఆలస్యం చేయకుండా వెంటనే తమ సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలని బోర్డు స్పష్టం చేసింది. ఆన్‌లైన్ ద్వారా లేదా కళాశాల ప్రిన్సిపాళ్ల ద్వారా ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ల జారీ, పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు.

Exit mobile version