Faculty Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్వ్యూలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ విద్యాశాఖ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో ఇంటర్వ్యూలు లేకుండానే ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. పారదర్శకతను పెంచాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మొత్తం 1,000 అధ్యాపక పోస్టుల భర్తీకి కసరత్తు పూర్తయింది.
యూనివర్సిటీల వారీగా ఖాళీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
అగ్రికల్చర్ యూనివర్సిటీ (566 పోస్టులు): 48 ప్రొఫెసర్, 148 అసోసియేట్, 370 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.
ఉద్యాన యూనివర్సిటీ (140 పోస్టులు): 17 ప్రొఫెసర్, 44 అసోసియేట్, 79 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.
పశువైద్య యూనివర్సిటీ (294 పోస్టులు): 235 పశువైద్య, 20 డెయిరీ, 39 మత్స్యశాఖ పోస్టులు.
ఎంపిక విధానం, మార్కుల కేటాయింపు ఇలా..
1. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు (మొత్తం 100 మార్కులు):
రాత పరీక్షకు 50 మార్కులు, అకడమిక్ మెరిట్ (విద్యార్హతలు)కు 50 మార్కులు కేటాయించారు. ఈ 50 మార్కుల వెయిటేజీ విభజన ఇలా ఉంటుంది:
బ్యాచిలర్ డిగ్రీ: 10%
మాస్టర్స్ డిగ్రీ: 15%
పీహెచ్డీ: 5%
అంతర్జాతీయ ఫెలోషిప్: 5%
గోల్డ్ మెడల్: 3%
జర్నల్ ఆర్టికల్స్: 4%
ఆవిష్కరణలు/పేటెంట్లు: 4%
పరిశోధన అనుభవం: 4%
2. అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్ పోస్టులు:
ఐకార్ (ICAR), యూజీసీ (UGC) మార్గదర్శకాల ప్రకారం విద్యార్హతలకు ఏకంగా 80 శాతం మార్కులు, అభ్యర్థి బోధనా నైపుణ్యాన్ని పరిశీలించే ‘డెమో లెక్చర్’కు 20 శాతం మార్కులు కేటాయించారు. ప్రభుత్వం నుంచి అధికారిక తుది ఆమోదం లభించిన వెంటనే వీటికి సంబంధించిన వరుస నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!