TS CABINET: తెలంగాణ మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక, రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించి ఆమోదం పొందనున్నారు. గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయాల్సిన ఇద్దరి పేర్లను కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేస్తారు.
మరోవైపు ఇళ్ల స్థలాలు, క్రమబద్దీకరణ, పట్టాల పంపిణీ దిశగా ప్రభుత్వం అడుగుటు వేస్తోంది. అవకాశం ఉన్నచోట పట్టాల పంపిణీ కోసం అనువైన స్థలాలు, వాటి వివరాలను గుర్తించారు. దీంతో పట్టాల పంపిణీకి మంత్రివర్గంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామకంఠం సహా ఇతరత్రా ఇండ్ల స్థలాల అంశాలను పరిష్కరించి పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దళితబంధు పథకం అమలుపైనా మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక, నిధుల సమీకరణపై కూడా కేబినేట్ చర్చించే అవకాశం ఉంది.
Read Also: Summer Camps : వేసవి శిబిరాలు నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ సన్నద్ధం
విచారణకు రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పండింది. ఈడీ కేసును ఎలా ఎదుర్కోవాలి? న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాని అనే అంశంపై నేతల అభిప్రాయాలు సీఎం కేసీఆర్ తెలుసుకుంటున్నారని తెలుస్తోంది.
కాగా ఢిల్లీ వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవితతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తమ కార్యక్రమాన్ని కొనసాగించాలని, ఆందోళన పడాల్సిన పనిలేదని కవితకు భరోసా ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని కవితకు ధైర్యం చెప్పినట్లు సమాచారం. కాగా, రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయనున్నారు.