NTV Telugu Site icon

Hangover Tips: హ్యాంగోవర్ పోవడానికి ఇలా ట్రై చేయండి!

Hangover

Hangover

Hangover Tips: మందు తాగే వారు చాలామంది ఉదయం పూట హ్యాంగోవర్ సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. రాత్రి సమయాలలో మందు తాగి పడుకొని లేచిన తర్వాత.. చాలామందికి తలపట్టేసినట్టుగా, కడుపులో వికారంగా ఉండేలా అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల ఉదయాన్నే వారి దినచర్యను కూడా సరిగా నిర్వహించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి కొన్ని చర్యల వల్ల వాటికి దూరంగా ఉండవచ్చు. మీ జీవితాన్ని సుఖంగా ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం ఇలా చేస్తే సరిపోతుంది.

* చల్లటి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల హ్యాంగోవర్ నుంచి త్వరగా బయటపడవచ్చు.

* అలసటను పోగొట్టే గుణం అల్లంలో ఉంటుంది. ఇది ఆల్కహాల్ ను అతి త్వరగా జీర్ణం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి హ్యాంగోవర్ ను త్వరగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

* ఇక తేనెలో కూడా ఆల్కహాల్ తగ్గించే గుణాలు ఉంటాయి. తేనె వల్ల జీర్ణక్రియను మెరుగుపరి బాగా చేస్తుంది.

* మూడు లేదా నాలుగు పుదీనా ఆకులని వేడి నీటిలో కలిపి తాగడం ద్వారా హ్యాంగోవర్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

* బెల్లం తినడం ద్వారా కూడా హ్యాంగోవర్ ని తగ్గించుకోవచ్చు. బెల్లాన్ని అల్లంతో కలిపి తింటే మంచి రిజల్ట్స్ ఉంటాయి.

* ఆపిల్, అరటి పండ్లు కూడా హ్యాంగోవర్ తొలగించడంలో పాత్రను పోషిస్తాయి. ముఖ్యంగా తేనెతో అరటి మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగడం ద్వారా కాస్త ప్రభావితంగా పనిచేస్తుంది.

* కొబ్బరినీళ్ళలో మినరల్ ఎలక్ట్రోలైట్స్ ఉన్న నేపథ్యంలో ఈ శరీరాన్ని రీహైడ్రేడ్ చేయడంలో తోడ్పడుతాయి. అలాగే హ్యాంగోవర్ ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.