అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ విజయోత్సవ సంబరాలను.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోను ఘనంగా జరుపుకున్నారు. పట్టణానికి చెందిన జనగం ఉదయ్ కిరణ్.. డొనాల్డ్ ట్రంప్ కు వీరాభిమాని. ట్రంప్ పుట్టినరోజు వేడుకలతో పాటు.. పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాడు. బుధవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం డొనాల్డ్ ట్రంప్ రెండవ సారి భారీ మెజార్టీ సాధించడంతో ఉదయ్ కిరణ్.. పట్టణంలోని ఇందిరా చౌక్ లో స్నేహితులతో కలిసి భారీ కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి తన అభిమాన ట్రంప్ విజయాన్ని అందరితో పంచుకున్నాడు. ట్రంప్ గెలుపుతో భారత్, అమెరికా మధ్య సత్, సంబంధాలు పెరిగి రెండు దేశాలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షను వ్యక్తం చేశాడు.
READ MORE: Deputy CM Pawan Kalyan: అమిత్ షాతో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నా..
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 270 మ్యాజిక్ ఫిగర్ ఉండగా.. ఇప్పటి వరకూ ట్రంప్ 280 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఇక విస్కాన్సిన్‌లో ట్రంప్ గెలుపొందారు. తాజా ఫలితాలను చూస్తుంటే అమెరికన్లు ఏకపక్షంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రంప్‌ను గెలిపించాలన్న ఉద్దేశంతోనే అమెరికన్లు ఏకపక్షంగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా ట్రంప్ భారీ విజయం దిశగా దూసుకెళ్లారు. ఇక రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడంపై ప్రపంచ నాయకులంతా శుభాకాంక్షలు తెలిపారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: అమిత్ షాతో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నా..