అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఇటీవల చెప్పినట్టుగానే.. కలప, ఫర్నిచర్‌పై సుంకాల మోత మోగించారు. కలపపై 10 శాతం.. కిచెన్ క్యాబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 25 శాతం సుంకాలను విధించారు. ఈ సుంకాలు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా జాతీయ భద్రత, దేశీయ తయారీని పెంచడంలో భాగంగా ట్రంప్ టారిఫ్‌లను వరుసగా పెంచుతున్నారు.
కిచెన్ క్యాబినెట్, బాత్‌రూమ్ పరికరాలు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్, భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానంటూ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కలప, కిచెన్ క్యాబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై సుంకాలు విధించారు. అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయకపోతే.. భారీ స్థాయిలో సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. చైనాతో సహా ఇతర దేశాల దిగుమతుల కారణంగా.. ఫర్నిచర్ వ్యాపారానికి కేంద్ర స్థానంగా ఉండే నార్త్ కరోలినా దాని ప్రభావాన్ని కోల్పోయిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవలి నెలల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్న కొన్ని దేశాలు తాజా సుంకాల నుంచి బయటపడనున్నాయి.
Also Read: Nepal vs West Indies: వెస్టిండీస్‌కు క్రికెట్ పాఠం.. చరిత్ర సృష్టించిన పసికూన నేపాల్!
జాతీయ భద్రతా ముప్పును ఎదుర్కోవడానికి సుంకాలు విధించడానికి అనుమతించే సెక్షన్ 232 ప్రకారం.. సుంకాలను డొనాల్డ్ ట్రంప్ వర్తింపజేస్తున్నారు. ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్, రాగి సహా ఇతర దిగుమతులపై రంగాల వారీ సుంకాలను వర్తింపజేయడానికి అనేక సారూప్య దర్యాప్తులను ప్రారంభించింది. సిమాలపై కూడా ట్రంప్ భారీగా సుంకాలు ప్రకటించారు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై ఏకంగా 100 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తానని ఆయన ప్రకటించారు.
