Site icon NTV Telugu

Trump: ట్రంప్ హెచ్చరిక.. పన్నులను తొలగించే వరకు కెనడాతో చర్చలుండవ్..

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాకు హెచ్చరికలు జారీ చేశఆడు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెనడా కొన్ని పన్నులను రద్దు చేసే వరకు అమెరికా, కెనడా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ముందుకు సాగవని స్పష్టం చేశారు. కెనడాను “బ్యాడ్ బిహేవియర్” దేశంగా ఆయన అభివర్ణించారు. నేటి (సోమవారం) నుంచి అమల్లోకి రానున్న డిజిటల్ సర్వీసెస్ టాక్స్ (DST) కొన్ని పన్నులను తొలగించాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ పన్ను అమెజాన్, గూగుల్, మెటా వంటి అమెరికన్ టెక్ కంపెనీలను దెబ్బతీస్తుంది.

Also Read:Alcohol Effects: జస్ట్ 21 రోజులు మద్యం మానేస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో అన్ని వాణిజ్య చర్చలను వెంటనే ముగించినట్లు ప్రకటించారు, కెనడా డిజిటల్ సర్వీస్ టాక్స్‌ను “యునైటెడ్ స్టేట్స్‌పై ప్రత్యక్ష, స్పష్టమైన దాడి” అని అభివర్ణించారు. కెనడియన్ వస్తువులపై రాబోయే ఏడు రోజుల్లో కొత్త సుంకాలను ప్రకటిస్తామని కూడా ఆయన హెచ్చరించారు. కెనడియన్ ప్రధాన మంత్రి మార్క్ కార్నీ దీనిపై ఇంకా స్పందించలేదు, కానీ ఆయన ప్రభుత్వం డిజిటల్ సేవా పన్ను విధించడాన్ని సమర్థించింది. ట్రంప్ ఇరాన్ గురించి మాట్లాడుతూ.. ఇరాన్ అణు కార్యక్రమం నాశనం చేశామని అన్నారు. ఇరాన్ ఇకపై అణు బాంబును తయారు చేయలేదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Exit mobile version