Site icon NTV Telugu

Trump: అమెరికా నిరసన.. దక్షిణాఫ్రికా జీ 20 సదస్సుకు ట్రంప్ గైర్హాజరు

Trump

Trump

నవంబర్‌ నెలాఖరున దక్షిణాఫ్రికాలో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు వెళ్లకూడదని అమెరికా నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన ఏ అధికారి కూడా ఈ సమావేశాలకు వెళ్లడం లేదని ట్రంప్ శుక్రవారం వెల్లడించారు.

ఇది కూాడా చదవండి: Samantha : రాజ్ నిడుమోరుకు సమంత హగ్.. కన్ఫర్మ్ చేసేస్తున్నారా..

దక్షిణాఫ్రికాలో శ్వేత అన్నదాతలు హత్యకు గురవుతున్నారని ఆరోపించారు. భూమి, పొలాలు చట్టవిరుద్ధంగా జప్తు చేయబడుతున్నాయని తెలిపారు. మానవ హక్కుల ఉల్లంఘనలు కొనసాగుతున్నందున ఏ యూఎస్ అధికారి కూడా శిఖరాగ్ర సమావేశానికి వెళ్లబోరని ట్రంప్ స్పష్టం చేశారు. 2026లో ఫ్లోరిడాలోని మయామిలో జీ 20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఇది కూాడా చదవండి: Crime News: లెస్బియన్ అఫైర్..! కన్న కొడుకునే చంపేసిన మహిళ..

సెప్టెంబర్‌లో ట్రంప్ మాట్లాడుతూ. దక్షిణాఫ్రికాలో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఇంతలోనే ట్రంప్ స్వరం మారింది. ఏ ఒక్క అధికారి కూడా వెళ్లబోరని తాజాగా తేల్చి చెప్పేశారు. దక్షిణాఫ్రికాలో నవంబర్ 22-23 మధ్యలో జీ 20 శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి.

Exit mobile version