Modi Trump Meeting: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా నుండి చమురు కొనుగోలు నిలిపివేస్తామని తనకు హామీ ఇచ్చారని అన్నారు. ఇది రష్యాను ఆర్థికంగా ఒంటరిచేయడానికి పెద్ద అడుగుగా ఆయన పేర్కొన్నారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించగా.. భారతదేశం రష్యా సముద్ర మార్గ చమురు కొనుగోలులో ప్రధాన కస్టమర్లలో ఒకటిగా మారింది.
అయితే ఈ విష్యం అమెరికా అధ్యక్షుడికి నచ్చలేదు. దీనితో భారత్ పై అనేక వ్యాణిజ నిబంధనలను కూడా విధించాడు. అయితే తాజాగా.. భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేస్తుండటం నాకు నచ్చలేదని.. మోదీ ఈ రోజు నాతో మాట్లాడి ఇకపై రష్యా నుండి చమురు కొనుగోలు చేయబోమని హామీ ఇచ్చారని ట్రంప్ అన్నారు. ఇది ఓ పెద్ద నిర్ణయం. ఇప్పుడు చైనాను కూడా అదే చేయించే ప్రయత్నం చేస్తాం అని ట్రంప్ వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
Minister Narayana: పిఠాపురంలో వర్మని జీరో చేశాం..! వైరల్‌గా మారిన మంత్రి నారాయణ వ్యాఖ్యలు
అలాగే, మేము అధ్యక్షుడు పుతిన్ నుండి కోరుకునేది ఒక్కటే.. అదే ఉక్రెయినియన్లను చంపడం ఆపాలి, రష్యన్లను కూడా చంపడం ఆపాలి. ఆయన స్వంత ప్రజలను కూడా చంపుతున్నాడని ట్రంప్ పేర్కొన్నారు. “జెలెన్‌స్కీ, పుతిన్‌ల మధ్య ద్వేషం చాలా ఎక్కువగా ఉంది, అది ఒక అడ్డంకి. కానీ, భారతదేశం రష్యా చమురు కొనకపోతే పరిస్థితి సులభమవుతుందని.. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే వారు రష్యాతో తిరిగి వ్యాపారం మొదలుపెడతారని ట్రంప్ అన్నారు. కాకపోతే, ఈ విషయమై భారత ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా ట్రంప్ వ్యాఖ్యలు నిజమైతే భారత చమురు వ్యూహంలో పెద్ద మార్పుకు సంకేతంగా భావించవచ్చు.
