China: డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసేలా నిర్ణయం తీసుకున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై 100% సుంకాన్ని ప్రకటించారు. నవంబర్ 1, 2025 నుంచి ఈ కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ నిర్ణయంతో యూఎస్-చైనా మధ్య పెద్ద వాణిజ్య యుద్ధం జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ ప్రకటనపై డ్రాగెన్ స్పందించింది. ట్రంప్ సుంకాలను ఏకపక్షంగా అభివర్ణిస్తూ, ప్రతీకార చర్యలకు బలమైన హెచ్చరిక జారీ చేసింది.
READ MORE: KantaraChapter1 : కాంతార చూసేందుకు 150 కి. మీ ప్రయాణం చేసిన తమిళ స్టార్ దర్శకుడు
అమెరికా చర్యలు చైనా ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని, ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా నిర్ణయంపై మంత్రిత్వ శాఖ నిర్మొహమాటంగా స్పందిస్తూ.. “సుంకాల విషయంలో అగ్రరాజ్యం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యలు మా దేశ ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయి. సాధారణంగా మేము ఎవరితో ఘర్షణలకు దిగము. అలాగని అవసరం వస్తే పోరాడటానికి సైతం వెనకడుగు వేయము. చర్యకు ప్రత్ని చర్య ఉంటుంది. ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయి.” అని ఓ చైనా పేర్కొంది.
READ MORE: SSMB29 : జక్కన్న కొత్త స్కెచ్.. ప్రియాంక చోప్రాకు మహేశ్ కంటే ఎక్కువ ప్రాధాన్యతా?
ఉన్నట్టుండి 100 శాతం సుంకాలు ఎందుకు విధించారు..?
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా చైనాపై 100 శాతం సుంకాలను విధించారు. అయితే, ఉన్నట్లుండి ట్రంప్‌కు చైనాపై ఎందుకంత కోసం వచ్చిందనేది ఆసక్తిగా మారింది. నవంబర్ 01 నుంచి చైనా నుంచి వచ్చే అన్ని వస్తువులపై 100 శాతం సుంకాన్ని విధిస్తూ ట్రంప్ నిర్నయం తీసుకున్నారు. రేర్-ఎర్త్ ఖనిజాలపై చైనా కొత్త నియంత్రణలను తీసుకువచ్చిన తర్వాత, అమెరికా నుంచి ఈ చర్య వచ్చింది. రేర్ ఎర్త్ ఖనిజాలు సెమీ కండక్టర్లు, ఫైటర్ జెట్‌లు, ఇతర అధునాతన టెక్నాలజీలో ఉపయోగిస్తారు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా చైనా గుత్తాధిపత్యం ఉంది. అయితే, సుంకాలపై ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్టులో, చైనా ‘‘అసాధారణంగా దూకుడు’’ వైఖనిని తీసుకుందని ఆయన ఆరోపించారు. చైనా చర్యలను ‘‘అంతర్జాతీయ వాణిజ్యంలో నైతిక అవమానం’’గా పిలిచారు. బీజింగ్ అదనపు చర్యలు తీసుకుంటే అదనపు సుంకాలు త్వరలో అమలులోకి వస్తాయని ట్రంప్ హెచ్చరించారు.
READ MORE: Roman Reigns: WWE రింగ్‌లో క్రికెటర్‌గా మారిన “రోమన్ రెయిన్స్”.. కోహ్లీ తరహా షాట్..(వీడియో)
దక్షిణ కొరియాలో జరిగే APEC శిఖరాగ్ర సమావేశానికి ముందు చైనా ఉద్దేశపూర్వకంగా ఎగుమతి నియంత్రణలను విధిస్తోందని అమెరికా అధికారులు ఆరోపించారు. ఈ సమావేశ వేదికలో ట్రంప్, జిన్‌పింగ్ భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఈ సమావేశం సందిగ్ధంలో పడింది. తాను జిన్‌పింగ్‌ను కలవడానికి ఎలాంటి కారణం లేదని ట్రంప్ అన్నారు. చైనా రేర్ ఎర్త్ ఖనిజాలపై పరిమితులు విధించడం, నేరుగా అమెరికా పారిశ్రామిక, రక్షణ అవసరాలను దెబ్బతీస్తుంది. అమెరికా తన రేర్ ఎర్త్ అవసరాలపై ఎక్కువగా చైనాపై ఆధారపడి ఉంది. ఇప్పుడిప్పుడే, యూఎస్ తన దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నంలో ఉంది. అమెరికాలో ఏకైక రేర్ ఎర్త్ ఉత్పత్తిదారుగా ఉన్న ఎంపీ మెటీరియల్స్‌లో 400 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది.
