Anders Vistisen: “మిస్టర్ ప్రెసిడెంట్, ఫ**ఆఫ్”.. వామ్మో.. ట్రంప్‌ను ఆ ఎంపీ ఇలా తిట్టేశాడేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anders Vistisen: డొనాల్డ్ ట్రంప్ మరోసారి గ్రీన్‌ల్యాండ్ విషయంతో అంతర్జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతున్నారు. అమెరికాకు ఆ ప్రాంతం కావాలన్న ఆయన వ్యాఖ్యలు యూరప్‌లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. ఇదే కోపం తాజాగా యూరోపియన్ పార్లమెంట్ వేదికపై స్పష్టంగా బయటపడింది. డెన్మార్క్‌కు చెందిన ఎంపీ అండర్స్ విస్టిసెన్, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ట్రంప్‌ను నేరుగా ఉద్దేశించి మాట్లాడారు. గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా ఆసక్తి, ట్రంప్ ఒత్తిడి గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఆయన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు. “ప్రెసిడెంట్ ట్రంప్ గారూ, జాగ్రత్తగా వినండి. గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్ రాజ్యంలో 800 ఏళ్లుగా ఉంది. అది అమ్మకానికి పెట్టే వస్తువు కాదు” అని ఆయన అన్నారు. ఆ తర్వాత ట్రంప్‌కు అర్థమయ్యే మాటల్లో చెబుతున్నానంటూ.. “మిస్టర్ ప్రెసిడెంట్, ఫ**ఆఫ్” అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. ఆ మాటలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి.
READ MORE: CM Chandrababu Davos Visit: మూడో రోజు దావోస్ టూర్.. నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు..
Also Read
- Tokyo Video: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
- NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్‌లైన్ ఇదే..
- Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌కు భారీ జరిమానా..!
అయితే ఈ వ్యాఖ్యలపై యూరోపియన్ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు నికోలాయ్ స్టెఫానుటా వెంటనే జోక్యం చేసుకున్నారు. ఈ సభలో అలాంటి భాష వాడటం నిబంధనలకు విరుద్ధమని, ఎంత బలమైన రాజకీయ భావాలు ఉన్నా ఇలాంటి మాటలు అంగీకరించబోమని ఆయన హెచ్చరించారు. క్షమాపణ చెబుతూ విస్టిసెన్‌ను ఆపేశారు. ఆ తర్వాత విస్టిసెన్ తన ప్రసంగాన్ని డేనిష్ భాషలో కొనసాగించారు. ఇదిలా ఉండగా.. ట్రంప్ గత కొద్ది రోజులుగా గ్రీన్‌ల్యాండ్‌పై మళ్లీ బహిరంగంగా ఒత్తిడి పెంచుతున్నారు. ఖనిజ సంపదతో నిండిన ఆర్కటిక్ ప్రాంతం అమెరికా, నాటో భద్రతకు చాలా కీలకమని ట్రంప్ వాదన. మంచు కరుగుతున్న కొద్దీ రష్యా, చైనా వంటి దేశాలు అక్కడ తమ పట్టు పెంచాలని చూస్తున్నాయని, అందుకే గ్రీన్‌ల్యాండ్ అమెరికాకు అవసరమని ట్రంప్ చెబుతున్నారు. ఇదే క్రమంలో డెన్మార్క్‌కు మద్దతుగా నిలిచిన యూరోప్ దేశాలపై 25 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ బెదిరింపులు కూడా చేశారు. దీంతో ఆయా దేశాలు ట్రంప్‌పై విమర్శలు కురిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Tokyo Video: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
-
LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్‌లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!