Site icon NTV Telugu

US Bans Sports Visas: ట్రంప్ పాలనలో నయా పాలసీ.. వారికి స్పోర్ట్స్ వీసాలపై నిషేధం!

Us Visa

Us Visa

US Bans Sports Visas: అమెరికా అధ్యక్షుడు తనదైన మార్క్ పాలనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో ట్రాన్స్‌జెండర్ మహిళలకు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల క్రీడలలో పాల్గొనడానికి వీసా కోసం దరఖాస్తు చేసే ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లకు ఇక నుంచి ఆమోదించారు. అమెరికన్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజా పాలసీ ప్రకారం, పురుషుడిగా జన్మించి లింగమార్పిడి చేసి మహిళల క్రీడల్లో పోటీ పడే క్రీడాకారుల దరఖాస్తులను ప్రతికూలంగా పరిగణించనున్నట్టు సోమవారం ప్రకటన విడుదల చేసింది.

Rekha Gupta: భారత్ కంటే పాకిస్థానే ప్రేమిస్తారు.. జయా బచ్చన్‌పై రేఖా గుప్తా ఆగ్రహం

ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారికి ఇచ్చే O-1A వీసాలు, అత్యుత్తమ ప్రతిభ కలిగిన వలసదారులకు ఇచ్చే EB-1, EB-2 గ్రీన్ కార్డులు, అలాగే నేషనల్ ఇంటరెస్ట్ వేవర్స్ వంటివి ఇకపై ట్రాన్స్‌జెండర్ మహిళలకు సులభంగా మంజూరు కాబోవని USCIS స్పష్టం చేసింది. బయాలజికల్ గుణల వల్ల పురుషులు మహిళల క్రీడలలో గెలిచే అవకాశాన్ని ట్రాన్స్‌జెండర్ ముసుగులో వాడుకుంటున్నారని చాలా కేసుల్లో స్పష్టమైందని USCIS అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ వ్యాఖ్యానించారు. ఈ చర్య మహిళా క్రీడాకారుల భద్రత, సమానత్వం, గౌరవం, నిజం అనే ప్రమాణాల్ని కాపాడేందుకు తీసుకున్నదని పేర్కొన్నారు.

Exclusive : అనుష్క ‘ఘాటీ’ రిలీజ్ డేట్ ఇదే

ఇది ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న సమగ్ర క్రీడా మార్గదర్శకాలలో భాగమే. ఇప్పటికే అమెరికాలో పలు రాష్ట్రాలు ట్రాన్స్‌జెండర్ మహిళల క్రీడల్లో పాల్గొనడాన్ని నిషేధించే చట్టాలు అమలు చేస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల ట్రంప్ ప్రభుత్వం “Keeping Men Out of Women’s Sports” అనే కార్యనిర్వాహక ఆదేశాన్ని కూడా విడుదల చేసింది. ఈ ఆదేశం ప్రకారం, మహిళల క్రీడల్లో పురుషులుగా జన్మించిన వ్యక్తుల పాల్గొనడాన్ని నిషేధించింది. గత నెలలో అమెరికా ఒలింపిక్ అండ్ పారాలింపిక్ కమిటీ కూడా తన పాలసీని ట్రంప్ ఆదేశాల ప్రకారంగా సవరించింది. ఈ మార్పులను మద్దతు పలికే వారు మహిళా క్రీడల్లో సమాన అవకాశాల కోసం ఇదే సరైన దారి అంటుండగా, విమర్శకులు మాత్రం ఇది మైనారిటీల హక్కులను కుదించే చర్యగా అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version