Site icon NTV Telugu

US Afghanistan Tensions: ట్రంప్ ఎఫెక్ట్.. తాలిబన్ సుప్రీం లీడర్‌కు హైసెక్యూరిటీ..!

Trump Effect Taliban

Trump Effect Taliban

US Afghanistan Tensions: అమెరికా ఆఫర్‌ను తాలిబన్లు అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో తాలిబన్ సుప్రీం లీడర్‌కు ట్రంప్ ఎఫెక్ట్ ఏ క్షణంలోనైనా తాగవచ్చనే సమాచారంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వెంటనే సుప్రీం లీడర్‌కు హైసెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇంతకీ అమెరికా బూచీకి ఆఫ్ఘన్ భయపడటానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నారా.. బాగ్రామ్ వైమానిక స్థావరం. ప్రస్తుతం ఈ వైమానిక స్థావరం విషయంలో అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్యలో వివాదం నడుస్తుంది. తాలిబన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత బాగ్రామ్ వైమానిక స్థావరంలో 20 ఏళ్లుగా ఉంటున్న యూఎస్ దళాలు వెనక్కి మళ్లాయి. అమెరికా తిరిగి ఇప్పుడు ఈ స్థావరాన్ని చేజిక్కించుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తాలిబన్ సర్కార్ అభ్యంతరం చెబుతుంది. అగ్రరాజ్యం నిర్ణయాన్ని ఆప్ఘాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం కాబుల్ కనిపిస్తుంది..

READ ALSO: Sony Bravia 5 Price: జీఎస్టీ ఎఫెక్ట్‌.. 71 వేలు తగ్గిన సోనీ బ్రావియా టీవీ! పండగ ఆఫర్స్ అదనం

శత్రుత్వానికి కూడా సిద్ధం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని వ్యూహాత్మక ప్రాధాన్యతగా అభివర్ణించారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. బాగ్రామ్ స్వాధీనానికి తాలిబన్లు సహకరించకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో ఒక్కసారి ఆఫ్ఘనిస్థాన్‌లో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైమానిక స్థావరాన్ని అమెరికాకు అప్పగించడానికి తాము సిద్ధంగా లేమని తాలిబన్లు స్పష్టం చేశారు. వాషింగ్టన్ బలవంతంగా వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే యూఎస్‌తో తిరిగి శత్రుత్వాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని తాలిబన్ వర్గాలు తెలిపాయి.

కాందహార్‌లో కట్టుదిట్టమైన భద్రత ..
నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఐనో మినా ప్రాంతంలోని స్థానిక వ్యాపారవేత్త గెస్ట్‌హౌస్‌లో ఉన్న తాలిబన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా నివాసాన్ని ప్రత్యేక భద్రతా కవర్‌లో ఉంచారు. ఇక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిపి వేయడంతో పాటు, ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్ పరికరాలను నిషేధించారు. ఆయన చుట్టూ కమాండోలను మోహరించారు. తాజాగా కాందహార్‌లో ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. తాలిబాన్ రక్షణ మంత్రి మొహమ్మద్ యాకుబ్ ముజాహిద్, విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి, ఉన్నత విద్యా మంత్రి నాడా మొహమ్మద్ నదీమ్, సీనియర్ నిఘా అధికారులు, కమ్యూనికేషన్ల మంత్రి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ హకీమ్ హక్కానీ ఈ సమావేశానికి హాజరయ్యారని సమాచారం. బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని బదిలీ చేయడం అసాధ్యమని వారు సమావేశంలో నిర్ణయించారు. అమెరికా దాడి చేస్తే, తాలిబాన్ నేరుగా స్పందిస్తుందని సమావేశం అనంతరం పలువురు తాలిబన్ అధికారులు స్పష్టం చేశారు.

ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిర్వహించడానికి అమెరికా ఆఫ్ఘనిస్థాన్‌కు తిరిగి రావచ్చని కొంతమంది అధికారులు అఖుండ్‌జాదాను హెచ్చరించారు. అయితే విదేశీ సైనిక ఉనికిని తిరిగి దేశంలోని ప్రవేశించడానికి అఖుండ్‌జాదా సమ్మతించలేదు. బాగ్రామ్ వైమానిక స్థావరం 20 ఏళ్లుగా అతిపెద్ద US సైనిక స్థావరంగా, యూఎస్ కార్యకలాపాలకు కీలకమైన కేంద్రంగా పని చేసింది. ఆగస్టు 2021లో US దళాల ఉపసంహరణ తర్వాత ఇది తాలిబన్ల ఆధీనంలోకి వచ్చింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో 2020 దోహా ఒప్పందాన్ని గౌరవించాలని అమెరికాకు తాలిబన్ సర్కార్ సూచిస్తుంది.

READ ALSO: Ahmed Hussein Al-Sharaa: అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తి.. అధ్యక్షుడి స్థానంలో ట్రంప్‌కు షేక్ హ్యాండ్..

Exit mobile version