Site icon NTV Telugu

MLC Kaushik Reddy : నిన్ను చెప్పుతో కొట్టాలంటే కవితక్క చెప్పు కూడా సిగ్గు పడుతుంది

Padi Kaushik Reddy

Padi Kaushik Reddy

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై దాడితో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, ఎంపీ ధర్మపురి అర్వింద్‌లు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే.. తాజాగా కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ అరవింద్ ఇంట్లో మహిళలు లేరా..? ఒక మహిళ అయిన కల్వకుంట్ల కవితపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. నిన్ను కవితక్క చెప్పుతో కొడతా అంది కదా.. నిన్ను చెప్పుతో కొట్టాలంటే కవితక్క చెప్పు కూడా సిగ్గు పడుతుందంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
Also Read : Gautam Adani New Plans: విదేశాల్లో కొత్త బిజినెస్‌.. క్లారిటీ ఇచ్చిన గౌతమ్‌ అదానీ..

బీజేపీ గుండా గాళ్లు మా కవితక్క ఇంటికి వచ్చి దాడి చేసిన రోజు లెక్క పత్రం లేదా అని ఆయన మండిపడ్డారు. బిడ్డా దాడి కాదు ఈపు సాపు చేస్తాం గుర్తు పెట్టుకో మిస్టర్ అరవింద్ అంటూ కౌశిక్‌ రెడ్డి ధ్వజమెత్తారు. జాగ్రత్తగా ఉండు, నోరు దగ్గర పెట్టుకో అక్క గురించి, కేటీఆర్, కేసీఆర్ గురించి మాట్లాడితే నాలుక కోస్తామంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వు మొగోడివి అయితే రాజీనామా చేసి ఈ సారి మా కవితక్క మీద పోటీ చెయ్యి.. మత కల్లోలాలు లేపి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటుర్రు అని కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం కొట్టుకుందామా బిడ్డా.. ఇది తెలంగాణ గుర్తు పెట్టుకో అంటూ కౌశిక్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Exit mobile version